రెండు మద్యం షాపులు లక్కీ డ్రా పూర్తి

Published: Wednesday December 01, 2021
కాగజనగర్, నవంబర్ 30, ప్రజాపాలన, ప్రతినిధి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మద్యపాన నిషేద కార్యాలయంలో గతంలో వాయిదాపడిన 2 మద్యపాన దుకాణాలు గెజిట్ నెంబర్ 31 సిర్పూర్ (యు) మరియు గెజిట్ నెంబర్ 32 లింగాపూర్ మద్యం షాపులను మంగళవారం లక్కీ డ్రా ద్వారా కేటాయింపు చేపట్టారు. ఈ లక్కీ డ్రా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా మద్యపాన నిషేధ అధికారితో కలిసి మద్యం షాపుల నిర్వాహకులను ఎంపిక చేశారు. సిర్పూర్ యు షాప్ కొరకు మొత్తం 5 దరఖాస్తులు రాగా అందులో నుంచి డ్రా ద్వారా మండాది హేమలతను  ఎంపిక చేశారు. లింగాపూర్ షాప్ కొరకు మొత్తం ఐదు దరఖాస్తులు రాగా అందులో నుండి డ్రా ద్వారా చవాన్ సునీల్ కుమార్ ని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.