కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ధర్నా

Published: Saturday August 06, 2022
బెల్లంపల్లి ఆగస్టు 5 ప్రజా పాలన ప్రతినిధి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, బెల్లంపల్లి పట్టణంలో  టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు శుక్రవారం బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు పెట్రోలు, డీజీలు, వంటగ్యాసు, ధరలను పెంచి నిత్యవసర వస్తువులపై జిఎస్టి పెంచి ప్రజలపై అధిక భారం మోపుతున్నారని అన్నారు, 
నిరుద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, అగ్ని ఫత్ వంటి  ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ  నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని,  భారీ వర్షాల కారణంగా ఇండ్లు కూలిపోయి, పంట పొలాలు కొట్టుకుపోయి, నీట మునిగిపోయి, ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ, తినడానికి తిండి లేక, దీనావస్తలో ప్రజలు తల్లడిల్లుతుంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ప్రజలను ఆదుకోవడం లేదని వారు ఎద్దేవా చేశారు. 
అవినీతిలో కూరుకుపోయిన టిఆర్ఎస్ పార్టీ అంతమయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని వారన్నారు.
అనంతరం  ఆర్డీవో కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు టి పి సి సి కార్యదర్శి ఎం, సూరిబాబు, గెళ్లి జయరాం యాదవ్, కారుకూరి రామచందర్, తొంగల మల్లేష్, పార్టీ మండల అధ్యక్షుడు సింగతి సత్తయ్య (బెల్లంపల్లి) ఎండి ఈషా, (తాండూర్) జనగామ తిరుపతి,( నెన్నె లా) చింతం స్వామి, ఎస్, రవీందర్ రావు, తాళ్ళ కృష్ణమోహన్, ముత్తె భూమయ్య, పోచంపల్లి హరీష్, రామ్ టెంకి హరికృష్ణ, పెట్టెము రాయలింగు, చుంచు మల్లయ్య. తదితరులు పాల్గొన్నారు.