మధిర హిందూ స్మశానవాటికను ఏటిపాలు చేస్తున్నా చోద్యం చూస్తున్న ఆలనా పాలనా తెలియని నేటి పాలకు

Published: Friday July 23, 2021
మధిర, జులై 22, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర శివాలయం వద్ద వైరా ఏటిలో చెక్ డాం నిర్మాణం చేపట్టిన గుత్తేదారు ఇటీవల తన ప్రొక్లైన్ తో మధిర హిందూ స్మశాన వాటికలో ఒక పెద్ద మట్టి కాలువతీసి అందు డ్రైనేజీ నీటిని డైవర్ట్ చేయటంవలన కురుస్తున్న వర్షాల వల్ల నేడు అందరూ చూస్తూ వుండగానే పవిత్రంగా చూసుకొనే కొందరి సమాధులు కూలిపోయి కాల్వలో పడ్డాయి రాష్ట్రంలో స్మశానాలు లేని గ్రామాల్లో వైకుంఠ థామలు కొత్తవి ఏర్పాటుచేస్తున్న నేటి తరుణంలో మధిరలో గతంలో ఎంతో ముందు చూపుతో భవిష్యత్తులో వుండబోయే జనాభా అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన సువిశాల హిందూ స్మశాన ఏరియాను అధికారాయుతంగా కబ్జా చేసి కొన్ని పనులను మధిరలో వేరేచోట్ల అవకాశ మున్నా హిందూ స్మశానవాటికలో నిర్మాణం చేశార ఇవి చాలవన్నట్లు ఇప్పుడు గుడ్డిగా అనాలోచితంగా దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకొనకుండా అర్ధం పర్థం లేని కాలవను త్రవ్వి సమాధులు కూలిపోయేటట్లుగా చేయటాన్ని తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తున్నది  నష్ట నివారణ చర్యలు చేపట్టి  మధిర హిందూ స్మశాన ఏరియాను సంరక్షించాలని మున్సిపల్ కమీషనరును ఛైర్ పర్సన్ గార్లను పాలకవర్గాన్ని నేడు సంబంధిత ప్రదేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం మధిర టౌన్ మున్సిపాలిటీ తెలుగుదేశం అధ్యక్షులు మల్లాది హనుమంతరావు రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి మైనీడు జగన్మోహన్ రావు ప్రభృతులు డిమాండ్ చేశారు స్మశాన స్థలాన్ని ఉన్న సమాధులను కాపాడి కూలిపోయిన వాటిని పద్ధతిగా కట్టించి ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు లేని యెడల పౌర సమాజంతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు