పండుగలో బతుకమ్మ చీరలు పంపిణీ..

Published: Monday September 26, 2022
పాలేరు సెప్టెంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి
నేలకొండపల్లి
తెలంగాణ ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల పంపిణీ గ్రామాల్లో
 
పండుగ వాతావరణం నెలకొంది. ఆదివారం మండలం లోని కొత్తకొత్తూరు పంచాయతీ లో సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ చేతుల మీదుగా
 
ప్రారంభించారు. అమ్మగూడెంలో సర్పంచ్ గండు సతీష్, పైనంపల్లి లో డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు చేతుల మీదుగా బతుకమ్మ
 
చీరల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు
 
మాట్లాడుతూ....బతుకమ్మ పండగ ను ప్రతీ ఒక్కరూ ఘనంగా
 
నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.