ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 26ప్రజాపాలన ప్రతినిధి

Published: Saturday August 27, 2022

మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లు ఇవ్వాలని ఎంఈఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా*

మధ్యాహ్న భోజన కార్మికులకు పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి, ఇప్పటివరకు ఎటువంటి బిల్లులు రాకపోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు వడ్డీల అప్పులు తెచ్చి, ఒంటి మీద ఉన్న బంగారాన్ని కుదవబేట్టి విద్యార్థులకు వంట చేసి పెడుతున్నారు. దీనికి తోడు ప్రతి స్కూల్లో మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని ప్రధానోపాధ్యాయులు కండిషన్లో భరించలేక అప్పుల పాలవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు వంటకు సంబంధించిన ఎటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా, గ్యాస్ వంట సామాన్లు కూరగాయలు ప్రతిదీ బయటకు అని తీసుకురావాల్సిందే కాబట్టి చారన కూరకు బారణ మసాలా లాగా, మధ్యాహ్న భోజన కార్మికులను ఈ ప్రభుత్వం పట్టి పీడిస్తుంది, ఈరోజు ధర్నాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏర్పుల నరసింహ సిఐటియు జిల్లా నాయకులు, కార్మికులు రమాదేవి, మంజుల, సరూప రంగమ్మ, భాగ్యమ్మ, లక్ష్మమ్మ, అనేకమంది మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొని పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే నాకు ఆత్మహత్య చరణమని ఆవేదన వ్యక్తం చేశారు కావున ప్రభుత్వ స్పందించి వెంటనే పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరారు.