అభివృద్ధి పనులను ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెబ్ - సైట్ లో పొందుపర్చాలి

Published: Friday October 29, 2021
జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ 
వికారాబాద్ బ్యూరో 28 అక్టోబర్ ప్రజాపాలన : వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతి నెల మాస, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పార్ఫర్మేన్స్ నివేదికలను ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెబ్ -సైట్ లో నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ శాఖల ద్వారా ప్రతి మాసము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పెరఫార్మెన్స్ వివరాలను ప్రతి నెల 5వ తేదీ వరకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెబ్ - సైట్ లో పొందుపర్చాలని సూచించారు. ఇట్టి సమాచారం రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ వరకు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యాలయం నుండి ఒక సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా ప్రతి నెల 5వ తేది వరకు నీవేదిక పంపించాలని సూచించారు. సీపీవో కార్యాలయం నుండి పనులను పర్యవేక్షించడం జరుగుతుందని తెలియజేసినారు. ఈ సమావేశంలో సీపీవో నిరంజన్ రావు, డి ఆర్ డి ఓ కృష్ణన్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.