శీతిలమైన అతిపురాతన దేవాలయం

Published: Wednesday February 24, 2021
మంగేల గ్రామంలో మరుగునపడ్డ ఆలయం
విశిష్టత కల్గిన విమాన గోపురంతో వర్ధిల్లిన కట్టడాలు
దేవాలయానికి పూర్వవైభవం తేవాలని గ్రామస్తుల ఆరాటం
 
బీరుపూర్, ఫిబ్రవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం మంగేల గ్రామంలోని గోదావరి సమీపాన గ్రామ ఊర చేరువు కట్టప్రక్కన ఎత్తయిన గట్టుమీద అతి పురాతన దేవాలయం శీతిలమైంది....
వివరాల్లోకి వెళ్ళితే గ్రామ సర్పంచు సుంచు శారదనరేందర్ ఆధ్వర్యంలో వైస్ ఎంపీపీ భలుమురి లక్ష్మణ్ రావు గ్రామానికి చెందిన పెద్దలు వివిధ పార్టీల నాయకులు సోమవారం రోజున పురాతన శీతిలమైన ఆలయాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ దేవాలయానికి ఒక విశిష్ట స్థానం ఉన్నదని సుమారు 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు ఆలయ వైభవం  కోనసాగవచ్చని గ్రామస్తుల అంచనా...
ప్రధానంగా ఆలయ చిత్రాలను బట్టిచూస్తే కట్టడాలు శిల్పాలు స్తంభాలు ఎర్రటి ఇసుక రాళ్లతో పొదిగిన రాళ్లు విమాన ఆకారంతో కనబడుతున్నాయి. ఉసిరికాయ ఆకారంలో ఉన్న శిల్పాలు నేలమీద పడి ఉండడంతో అందరిని ఆకర్షించి మగ్దుల్ని చేస్తున్నాయి. గర్భగుడి పైకప్పులో శిల్పకళలు చేతులలో ఢమరుఖం త్రిశూలం సర్పం గధదండం ఉన్న శిల్పాలు మనకు కళ్ళకు అద్దినట్టు కనబడుతున్నాయి...
ముఖ్యంగా గుప్తనిధుల ముఠాలు గర్భగుడి లోపల వెలుపల తవ్వకాలతో విగ్రహాలు లేకుండ మాయం చేశారని గ్రామస్తులు ఆరోపనలు వ్యక్తం చేస్తున్నారు...
గ్రామస్తుల ఆలోచన ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురాతన చరిత్ర కలిగిన శీతిలవస్థమైన ఆలయాన్ని నిర్మించి తీరాలని మరియు జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రత్యేక చోరవ తీసుకోని నిధులు కేటాయించి ఆలయానికి పూర్వవైభవం తేవాలని కోరుతున్నారు. ముఖ్యంగా ధాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి కృతజ్ఞులు కావాలని  గ్రామ సర్పంచ్ సుంచు శారదనరేందర్ గ్రామస్తులు కోరుతున్నారు.