రోడ్ల మరమ్మతులకు అధిక నిధులు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్.... హర్షం వ్యక్

Published: Wednesday December 28, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
రాచబాటలకు రూ.2500 కోట్లు  రోడ్ల మరమ్మతులకు రూ.1,865 కోట్లు కల్వర్టుల నిర్మాణానికి రూ.635 కోట్లు
 విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇటీవలే ఆర్‌ అండ్‌ బీపై సీఎం సమీక్ష మరమ్మతులపై అధికారులకు సూచనలు15 రోజుల్లోనే నిధులు విడుదల
రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులు, కల్వర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.1,865 కోట్లు, కల్వర్టుల నిర్మాణానికి రూ.635 కోట్లను ఆర్‌ అండ్‌ బీ శాఖకు విడుదల చేసింది. భారీ వర్షాలకు అనేకచోట్ల రోడ్లు దెబ్బతినటంతో ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం జాప్యంలేకుండా నిధులను విడుదల చేసింది. నిధులు మంజూరైన నేపథ్యంలో రోడ్ల మరమ్మతు, కల్వర్టుల నిర్మాణానికి అధికారులు టెండర్లు ఖరారు చేయనున్నారు. నిధుల విడుదలకు చొరవ చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరియు పినపాక నియోజకవర్గం అభివృద్ధికి అధిక నిధులు తీసుకొచ్చినందుకు విప్ రేగా కాంతారావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన బూర్గంపాడు బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి.
రాష్ట్రంలో ఈ వానకాలంలో కురిసిన భారీ వర్షాలకు అనేకచోట్ల రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల కల్వర్టులు కూడా కొట్టుకుపోవటంతో, ఈ నెల 10న ఆర్‌ అండ్‌ బీ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.