టీఎస్ ఐపాస్ 970 యూనిట్లు ఆమోదం * జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

Published: Saturday January 07, 2023
వికారాబాద్ బ్యూరో 6 జనవరి ప్రజా పాలన :  టీఎస్ ఐపాస్ తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు  ప్రాజెక్ట్ ల మంజూరు ప్రక్రియ  క్రింద దరఖాస్తు చేసుకున్న 1123  యూనిట్లకు స్క్రూటిని చేసి  970 యూనిట్లకు కమిటీ ఆమోదించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలియజేసినారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్ లో జిల్లా ఇన్వెస్టిమెంట్  ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో  పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించెందుకు గాను దరఖాస్తు చేసుకున్న వారిలో 03 ఎస్సి, 10 మంది ఎస్టీ లబ్ధిదారులకు వాహనాల కొనుగోలుపై 35 శాతం సబ్సిడీతో రూ.40,60,549 లు మంజూరు చేసినట్లు ఆయన తెలియజేశారు. ముగ్గురు ఎస్సీ లబ్ధిదారులకు
రూ. 8,30,652 లు ఆమోదించగా, 10 మంది ఎస్టి  లబ్ధిదారులకు రూ. 32,29,897 లు సబ్సిడీని  మొత్తం 13 మందికి 40,60,549 రూపాయల సబ్సిడీని కమిటీ ఆమోదించినదని అన్నారు. మరో 95 దరఖాస్తులను వివిధ కారణాలవల్ల తిరస్కరించినట్లు,  మిగతా దరఖాస్తులు వివిధ దశలలో  పరిశీలనలో ఉన్నాయన్నారు. ఈ యూనిట్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వినయ్  కుమార్,   వెహికిల్ ఇన్స్పెక్టర్ జోసెఫ్ , గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి బాబూమోజెస్,  ఎల్ డి ఎం రాంబాబు, భూగర్భ జల శాఖ అధికారి దీపరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.