అంగవైకల్య రాజుకు దాతల సహకారంతో కిరాణాషాపు ఏర్పాటు

Published: Monday June 14, 2021
రాయికల్, జూన్ 13 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం జగన్నాథ్ పూర్ గ్రామంలో నిరుపేద ఆదివాసి కుటుంబానికి చెందిన పెద్రం రాజు కు రెండు కాళ్లు లేవు, 80 శాతం అంగవైకల్యంతో, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎలాంటి ఉపాధి లేక కటిక పేదరికంలో ఇబ్బందులు పడుతున్న విషయం నిరుపేద, అంగవైక్య రాజు కు ఉపాధి కల్పించమని చింతకుంట సాయికుమార్ దృష్టికి తీసుకపోగా, స్పందించిన కొందరు దాతలు, మరియు న్యాయ వాది చిలకమర్రి మదన్మోహన్, ఆర్థిక చేయూతతో రేకుల షెడ్డు, నిర్మించి, కిరాణా షాప్ కు సరిపడా సామానును కొనిచ్చి, రాజు చేత కిరాణం షాప్ ఏర్పాటు చేయగా దానిని దాతల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వయంశక్తితో ఆర్థిక అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలు ఆవరోధించాలి, అనుకునే పేదలకు, ఆత్మస్థైర్యం నమ్మకం, ఉంటే అనేక రకాలుగా ప్రయత్నించి విజయం సాధించవచ్చు అని, ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగే ప్రతి ఒక్కరికి సమాజం చేయూత ఇస్తుందని మా వంతుగా రాజుకు షాప్ ఏర్పాటు చెయ్యగా దానిని ఆయన నిలుపుకూని, ఈ రంగంలో రాణించాలని కాంక్షిస్తూనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకమర్రి మదన్మోహన్, కడకుంట్ల జగదీశ్వర్, కోల శ్రీనివాస్, రాం రెడ్డి, ఎద్దండి ముత్యంపు రాజురెడ్డి, ఎనగందులరమేష్, మహమ్మద్ రషీద్, గంట్యాల ప్రవీణ్, ఇమ్మడి విజయ్, వాసాల లక్ష్మి నారాయణ, మోహన్ రెడ్డి, పరచ శంకర్, బీర్ షాప్, తదితరులు పాల్గొన్నారు.