భద్రాద్రి, నెహ్రూ కప్పును ప్రారంభోత్సవం చేసిన తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయ శేఖర్ . భద్రా

Published: Monday December 05, 2022
భద్రాచలంలో క్రికెట్ క్రీడా సంభరోత్సవాలు 27 వసంతంలో అడుగుపెడుతున్న నెహ్రూ కప్పు ఈసారి కీర్తిశేషులు తాలూరి భారతీదేవి  జ్ఞాపకార్థం ప్రైజ్ మనీ క్రికెట్ టోర్నమెంటుకు అందజేయనున్నారు. మారుమూల ప్రాంతం భద్రాచలం నుండి జాతీయస్థాయి వరకు క్రీడాకారులను తయారుచేసిన క్రీడామైదానం మన భద్రాచలం నుండి జాతీయస్థాయి వరకు ఈ క్రీడా మైదానం ఉండే ఎదగటం ఎంతో గొప్ప విషయం అని గతంలో మేము ఇంటర్ చదివే రోజుల్లో ఇదే క్రీడా మైదానంలో నేను మా సోదరుడు ఈ గ్రౌండ్లో ఆడుకోవడం జరిగిందని అప్పుడు అసలు ఏ వసతులు లేవని ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది అని తాళ్లూరి జయ శేఖర్  తెలియజేశారు .అదేవిధంగా క్రీడాకారులను ఉత్సాహ పరుస్తూ భద్రాచలం తాసిల్దార్ శ్రీనివాస్ యాదవ్ బౌలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొదటి ప్రారంభ రోజున ఫ్రెండ్లీ మ్యాచ్ మరియు దేవస్థానం జట్లు  తలపడనున్నాయి. తరువాత పోలీస్ మరియు రెవిన్యూ జట్లు . లాయర్స్ మరియు డాక్టర్స్ జట్లు తలపడనున్నాయి నెహ్రూ కప్ వ్యవస్థాపకులు వాతాడి దుర్గా అశోక్ మరియు తోటమల్ల బాలయోగి గారు క్రీడాకారులు ఉద్దేశించి మాట్లాడటం జరిగింది . అదేవిధంగా దాట్ల శ్రీనివాసరాజు అట్లూరి శ్రీధర్ గారు ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రీడా అభిమానుల కొరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వారి మాటల్లో భద్రాచలంలో మా ఆధ్వర్యంలో ఈ నెహ్రూ కప్ నిర్వహణ జరగటం చాలా సంతోషంగా ఉందని నిర్వాహక కమిటీ తెలియజేసింది. ఈరోజు ముఖ్యఅతిథిగా విచ్చేసిన వారు భద్రాచలం తాసిల్దార్ శ్రీనివాస్ యాదవ్  భద్రాచలం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి నాగరాజు రెడ్డి  భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ పివిఎన్ రావు .తాళ్లూరి జయశంకర్  పిఎసి చైర్మన్ బూర్గంపాడు శ్రీనివాస్ , ఇరవైండి మాజీ ఎంపీటీసీ తాళ్లూరి వంశీ కృష్ణ   సిపిఎం వెంకటరెడ్డి  టి వైఎస్ఆర్సిపి కొల్లు వెంకటరెడ్డి దేవస్థానం డిఈ  లాయర్ తిరుమల రావు  నెహ్రూ కప్పు టోర్నమెంట్ పిఆర్ఓ గుమ్మడపు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు