బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు

Published: Thursday March 09, 2023
మధిర మార్చి 8 ప్రజా పాలన ప్రతినిధి:
బిఆర్ఎస్ పార్టీ మధిర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమం డైరెక్టర్ జ్యోతి ఆర్కే ని పలువురు ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఎన్నో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ ఎంతోమంది అనాధలకు అమ్మగా అనాధ ఆశ్రమం నిర్వహిస్తూ ఎవరు చేయలేని మహోన్నతమైన సేవ నిర్వహిస్తున్న మరో మదర్ తెరిసా దోర్నాల జ్యోతి ఆర్కే ని సన్మానించుకోవటం గర్వంగా ఉంది అంటూ పలువురు ప్రజా ప్రతినిధులు ప్రశంసల జల్లు కురిపించారు.. ఈ సందర్భంగా మధిర పట్టణ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.