ఇన్వెస్ట్ మెంట్ కార్యకలాపాలను దుబాయ్ బదిలీ చేసిన మలబార్

Published: Wednesday June 23, 2021
అమీర్ పేట్ జోన్ (ప్రజాపాలన ప్రతినిధి) : అంతర్జాతీయ ఆభరణాల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ ఇన్వెస్ట్మెంట్ కార్యకలాపాలను దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ తో పునర్వ్యవస్థీకరించిదని సోమాజిగూడ స్టోరీ హెడ్ షరీజ్ తెలిపారు. ఈ మేరకు సోమాజిగూడ స్టోర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... నాస్ డాక్ దుబాయ్ సెంట్రల్ సెక్యూరిటీ డిపాజిటరి తో తమ అంతర్జాతీయ కార్యకలాపాల షేర్ల ను నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ముఖ్య ఘట్టం మలబార్ పెట్టుబడిదారులతో సంబంధాలను బలోపేతం చేస్తుందని కంపెనీ వాటాలకు సంబంధించి కార్పొరేట్ కార్యకలాపాలను పారదర్శకంగా, నియంత్రణలో సమర్థవంతంగా, సురక్షితంగా నిర్వహించబడతాయి అన్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ గవర్నర్, దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ చైర్మన్ హిజ్ ఎక్సలెన్సీ, ఎస్సా కాజిమ్ సమక్షంలో ఆల్బమ్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ దుబాయ్ మార్కెట్ ప్రారంభ గంటలు మోగించి ఈ వేడుకలను ప్రారంభించారని తెలిపారు.