జోరుగా ధాన్యం కొనుగోలు ,చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం కొంటుంది .బూర్గంపాడు పీఏసీఎస్ చైర్

Published: Tuesday December 13, 2022

బూర్గంపాడు (ప్రజా పాలన.)

ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం చివరిగింజ వరకు కొనుగోలు చేసేందుకు తపిస్తున్నది. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్ల కోసం కోట్ల రూపాయలను వ్యయం చేసి మౌలిక వసతులతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. గతేడాది కంటే 11 లక్షల తన్నులు అధికంగా సేకరించిందని, తెలంగాణ ప్రభుత్వం దాదాపు 8 లక్షల మంది రైతుల దగ్గర కొన్న ఈ ధాన్యం విలువ 9,600 కోట్లు. దాదాపు 20 రోజులుగా ధాన్యం కొనుగోళ్లను శరవేగంగా జరుపుతూనే ఉన్నదని. ఆ వివరాలను ఆన్‌లైన్‌ చేయడంతోపాటు రైతులకు ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లింపులను సైతం జరుపుతున్నదని రాష్ట్రంలోనే కాకుండా నియోజకవర్గ మండల స్థాయిలో సైతం దాన్యం కొనుగోలు చేస్తున్నామని పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. బూర్గంపాడు మండలంలో ధాన్యం కొనుగోలు ఇప్పటికే ప్రారంభించామని రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించామని వారు ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే కాలంలో రైతుల నుంచి మరింత ధాన్యం సేకరించి కొనుగోలు చేస్తామని రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతుల ధాన్యం సేకరించిన ఆనతి కాలంలోనే డబ్బులు వారి వారి ఎకౌంట్లో జమ చేస్తామని వారు తెలిపారు.