కోమటికుంట, పోచమ్మ కుంట మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి

Published: Monday June 28, 2021
బాలపూర్, జూన్ 27, ప్రజాపాలన ప్రతినిధి : ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ ఖాళీ స్థలాలు, చెరువులున్న, కబ్జా కాకుండా వాటిని  బ్యూటికేషన్ గా చక్కటి ప్రణాళికతో తయారు చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ 4వ డివిజన్ కార్పొరేటర్ సంరెడ్డి స్వప్న వెంకట రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోమటికుంట, పోచమ్మ కుంట బ్యూటిఫికేషన్ గా డెవలప్మెంట్ కొరకు సుమారు 5 కోట్ల వ్యయంతో ఆదివారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...... గతంలో కురిసిన భారీ వర్షాలకు గొలుసుకట్టు చెరువులు ఉన్న ఏక్కడ ఏ చెరువు ఏప్పుడు తెగిపోతుందినీ, ప్రతి ప్రజా ప్రతినిదులు అలర్ట్ గా ఉంటూ, అదేవిధంగా ఎప్పుడు ఏమి జరుగుతుందోని లోతట్టు ప్రాంతాలలో కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమని జీవనం గడిపారు. సీఎం ఆదేశాల మేరకు కోమటికుంట, పోచమ్మ కుంట, డెవలప్మెంట్ అభివృద్ధి కొరకు ఐదు కోట్ల వ్యయంతో, అదేవిధంగా పెద్దలు, మహిళలు, సీనియర్ సిటిజెన్స్, పార్క్ కు లలో వాకింగ్ ట్రాక్, ఆ పార్కులలో కొంత సమయంలో ప్రశాంతంగా గడపాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాలనీవాసులకు, ప్రజాప్రతినిధులకు ఇలాంటి మంచి అభివృద్ధి పనులుకి ప్రతి ఒక్కరు సహకరించి నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి డివిజన్లో అంచేలంచేలుగా డెవలప్ అవుతాయని హామీ ఇచ్చారు. గతంలో జరిగినట్లు అంత ఏక్కువ వర్షాలు కురిసినాగాని ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా శాశ్వత పరిష్కారానికి చక్కటి ప్రణాళికతో ప్రజలకు అవసరాలనబట్టి అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ చిగురంత పారిజాత నరసింహారెడ్డి, టిఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడీ రామ్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డి ఇ అశోక్ రెడ్డి, ఏ ఈ బిక్క నాయక్, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు ఏనుగుల రామ్ రెడ్డి, భీమిడి సప్న జంగారెడ్డి, ముత్యాల లలితా కృష్ణ, లిక్కీ మమత కృష్ణారెడ్డి, బోయ పల్లి దీపిక శేఖర్ రెడ్డి, మాధురి విరకర్ణ రెడ్డి, సుర్ణ గంటి అర్జున్, పెద్దబ్బాయి శ్రీనివాస్ రెడ్డి, పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కార్పొరేషన్ అధికారులు, కాలనీవాసులు అభిమానులు యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.