సిర్గాపూర్ మండల క్రికెట్ టీం కు ప్రథమ బహుమతి

Published: Friday January 14, 2022
హైదరాబాద్ 12 జనవరి ప్రజాపాలన ప్రతినిధి: ప్రథమ బహుమతి పొందిన సిర్గాపూర్ మండల క్రికెట్ టీం. శుభాకాంక్షలు అందజేసిన పలువురు క్రికెట్ క్రీడాభిమానులు. సంగారెడ్డి జిల్లా రేగోడ్ మండల ఆర్.ఇటిక్యాల గ్రామ వాస్తవ్యులు కీ.శే. సంగం అనిల్ పటేల్ స్మార కార్థం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. చివరి క్రికెట్  మ్యాచ్ లో లింగంపల్లి జుట్టు పై సిర్గాపూర్ మండల జట్టు విజయం సాధించింది. ప్రథమ బహుమతి గా పదిహేడు వేల రూపాయల నగదును నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరిగిన క్రికెట్ టోర్నీలో మొదటి విజేతగా సిర్గాపూర్ మండల టీం నిలిచినది. మొదటి విజేతగా నిలిచిన సిర్గాపూర్ క్రికెట్ టీం జట్టు కేప్టెన్ అంబదాస్ కు నగదు బహుమతిగా నిర్వాహకులు పదిహేడు వేల రూపాయలను ట్రోఫీని అందించి అభినందించారు. క్రికెట్ టోర్నమెంట్ లో ప్రథమ స్థానంలో నిలిచిన సిర్గాపూర్ గ్రామ క్రికెట్ టీం క్రీడాకారులకు పలువురు క్రీడాభిమానులు, మండల ప్రజలు మరియు స్నేహితులు  శుభాభినందనలు తెలియజేశారు. దీనిలో భాగంగా సిర్గాపూర్ మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బాబు మరియు టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నర్సాగౌడ్ తదితరులు సిర్గాపూర్ క్రికెట్ టీంను అభినందించారు. అంతేకాకుండా క్రికెట్ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టు గెలుపు దిశగా రాణించడానికి తోడ్పడిన సిర్గాపూర్ మండల వాస్తవ్యుడు క్రికెట్  క్రీడాకారుడు సంతుకు ప్రోత్సాహక బహుమతి గా కొంత నగదును సిర్గాపూర్ మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బాబు అందజేశారు. గ్రామ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నర్సాగౌడ్ ప్రవీణ్, పండరి నగేష్, శుభం సాయి, విఠల్, వంశీ పైడిపల్లి గ్రామ యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.