కోటమర్పల్లి ఘనంగా నిర్వహించిన సిఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

Published: Friday February 18, 2022
మర్పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బి.రాచయ్య
వికారాబాద్ బ్యూరో 17 ఫిబ్రవరి ప్రజాపాలన : 60 ఏండ్ల ఉద్యమ పోరాటాన్ని సిఎం కేసిఆర్ తన భుజస్కంధాలపై వేసుకుని ముందుండి నడిపించిన మహానాయకుడని మర్పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బి.రాచయ్య కొనియాడారు. గురువారం మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామంలో సిఎం కేసిఆర్ 68వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిఎం కేసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి జన్మించిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి బి.రాచయ్య మాట్లాడుతూ రాష్ట్ర సాధనకు అందరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపి సమన్వయంతో ఆంధ్ర పాలకుల వెన్నులో వణుకు పుట్టించాడని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి పక్కా ప్రణాళికను రూపొందించి సక్రమంగా అమలు పరిచిన ధీశాలి అని ప్రశంసించారు. రైతే రాజుగా చేయాలనే లక్ష్యంతో తన మానస పుత్రిక అయిన మిషన్ కాకతీయను ప్రవేశ పెట్టి రైతుల ముఖాల్లో ఆనందాన్ని నింపారని వివరించారు. రైతుబంధు, రైతుబీమా, మిషన భగీరథ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు బహుళ జనాదరణ పొందాయని గుర్తు చేశారు. రాష్ట్ర పథకాలను దేశం కాపీ కొట్టడం సిఎం కేసీఆర్ పాలనకు నిదర్శనమన్నారు. సిఎం కేసీఆర్ ఏ పథకాన్ని అమలుపరిచినా దూరదృష్టితో ఆలోచించి అమలు చేస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రఘుపతి రెడ్డి, ఉప సర్పంచ్ అంజిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు తైసిన్, వార్డు మెంబర్ జైహింద్ రెడ్డి, రమేశ్ గౌడ్, శ్రీ శైలం గౌడ్ రైతుబందు అధ్యక్షుడు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దశరథం, నర్సింలు బీసీ సెల్ యువజన విభాగం అధ్యక్షులు తెరాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.