ఖేడ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి

Published: Saturday December 11, 2021
హైదరాబాద్ 10 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రె) వీరారెడ్డి (స్వామి). సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ వీరారెడ్డి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి అంబాదాస్ రాజేశ్వర్ తనిఖీ చేశారు. రైతులకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. తనిఖీలో బాగంగా నారాయణ్ ఖేడ్ మండలం  కాంజిపూర్ లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను తనిఖీ చేశారు. సంబందిత రికార్డు లను పరిశీలించారు. తూకం వేసే యంత్రం సక్రమంగా పనిచేస్తుందా అని  పరిశీలించడం జరిగింది. తదుపరి ధాన్యం కొనుగోలు విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని  రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. రెవెన్యూ ఐకెపి సిబ్బంది ఎపియం టీక్యా నాయక్ మరియు మండల స్థాయి అధికారులు వెంట ఉన్నారు.