కోవిడ్ బాధితుల కుటుంబాల కు కౌన్సిలింగ్

Published: Thursday May 27, 2021
తహసీల్దార్, ఏం పి డీ ఓ, ఈ ఓ పి ఆ ర్ డీ, యస్ ఐ, వైద్య అధికారి బృందం
మధిర, ప్రజాపాలన ప్రతినిధి : 26వ తేదీ ఈరోజు మధిర మండల దెందుకూరు, నిదానపురం, మాటూరు, సిరిపురం, ఆతుకూరు తదితర గ్రామాల్లో mro D సైధులు, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, Eoprd రాజారావు, SI రమేష్, వైద్య అధికారులు dr వెంకటేష్  dr పుష్పలత బృందం సంయుక్తంగా గ్రామాల్లో పర్యటన చేసి కోవిడ్ భాధితులను గుర్తించి వారికి డి ఐసొలేషన్ సెంట్రర్లు యెక్క ప్రాముఖ్యత గురించి హోమ్ఐసోలాషన్ లో ఉన్న నష్టాలు గురించి సంపూర్ణoగా వివరించినారు. ముందుగా దెందుకూరు సర్పంచ్ కోట విజయశాంతి వెంకటకృష్ణ ద్వారా గ్రామoలో స్లమ్ ఏరియా (ఇరుకూ నివాసంలో) సరైనా వసతులు లేని వారిని గుర్తించి వారిని వెంటనే ఊరిలో ఉన్న ఐసొలేషన్ సెంటర్లకు తరిలించారు. దెందుకూరు హైస్కూల్ లో ఉన్న ఐసొలేషన్ సెంటర్ కు 20 మంది కోవిడ్ బాధితులను తరిలించారు. కోవిడ్ కేసులు పెరగకుండాతగు జాగ్రత్తలు పాటించాలని, కోవిడ్ పోగ్రామ్ అధికారుల మాటలు గ్రామ ప్రజలు తప్పకుండ వినాలి అని తెలియపరిచినారు. కోవిడ్ కేసులు బైట తిరిగితే చట్ట పర మైన చర్యలు తీసుకొంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది లంకా కొండయ్య కాంతలీల నాగమణి ఆశలు సత్యవతి, కళ్యాణి, లు కోట నరేష్, ప్రసాద్, జి పి సిబ్బంది కృష్ణ, రామారావు నగేష్, ఐకేపీ, సిబ్బంది పాల్గొన్నారు.