పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

Published: Tuesday September 13, 2022
ఎబ్బనూర్ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 12 సెప్టెంబర్ ప్రజా పాలన : పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎబ్బనూరు గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ గ్రామంలో వీధి వీధి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎబ్బనూర్ గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలోని పలు పరిసరాలను మోరీలను, కాలువలను లోతట్టు బావులను ఆయన పరిశీలించారు. దోమలపై దండయాత్ర చేస్తున్నామని స్పష్టం చేశారు. పరిసరాలను అపరిశుభ్రం చేయకుండా ప్రతి కుటుంబం వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ సహకరించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ట్రాక్టర్ల ద్వారా వ్యర్థ పదార్థాలను తరలించి, దోమల ఉత్పత్తి జరగకుండా, దుర్వాసన వేదజల్లకుండ, ఊరికి దూరంగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నామని వివరించారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు
శానిటేషన్ పనులు చేపిస్తూ నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు, వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ గ్రామ పంచాయతీ ప్రజల అరోగ్య భద్రతకు ఎనలేని కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామంలోని ప్రతి నెల రెండో వారంలో వాటర్ టాంక్ ను ,వీధిలో మోరిలు, కాలువలు శుభ్రం చేపించి శానిటేషన్ లో భాగంగా బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ, దోమల సమూల నిర్మూలన దిశగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ప్రస్తుత వర్షా కాలంలో సీజనల్ వ్యాధులతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హితవుపలికారు. దోమల బెడద నుండి తప్పనిసరిగా దోమతెరలు వాడాలని నివాస ప్రాంతాలకు సమీపంలో వర్షపు నీరు నిలువ ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు . డెంగ్యూ మలేరియా అతిసార వైరల్ ఫీవర్ తదితర సీజనల్ వ్యాధులు తలెత్తకుండా గ్రామంలో గట్టి నివారణ చర్యలు చేపట్టామనీ వెల్లడించారు.  ఈ కార్య క్రమంలో భాగంగా ఉప సర్పంచ్ అరుణ గోపాల్, గ్రామ సెక్రటరీ రాజేష్ ,టిఆర్ఎస్ పార్టీ ఉప అధ్యక్షులు రహీమత్ , మొదటి వార్డ్ మెంబెర్ ప్రశాంత్ , రాజు , శ్రీనివాస్ గౌడ్, రాంచెంద్రయ్య, అనంతయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.