మధిర మండలం మున్సిపాలిటీ పరిధిలోలో భారీ వర్షంజలమయమైన లోతట్టు ప్రాంతాలు

Published: Saturday August 06, 2022

మధిర రూరల్ ఆగస్టు 5 మండలం పరిధిలో పట్టణంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో మండలం పరిధిలో దేశినేనిపాలెం అనేక గ్రామాల్లో పట్టణంలోని పలు రహదారులు జలమయ్యాయి. భారీ వర్షాలకు జనజీవినం స్తంభించపోయింది. భారీ వర్షాల వలన ప్రజలెవరూ బయటకు రాకుండా గృహాల కే పరిమితమయ్యారు. భారి వర్షాలకు మధిర మండలం పట్టణంలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండటంతో వర్షపు నీరు ప్రధాన రహదారుల పైకి రావటంతో రహదారులన్నీ చెరువులుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా వర్షపు నీరు చేరి రోడ్లన్నీ జలమయం అవడంతో వాహన దారులు, ప్రజలు బయటికి రావడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. లడక బజారులోని డ్రైనేజీ పొంగటంతో రవాణా స్పందించిపోయింది. ఆ ప్రాంత ప్రజలు సుమారు మూడు గంటల పాటు బయటకు రాకుండా గడిపారు. డ్రైనేజీలను ఆక్రమించడం డ్రైనేజీలపై అక్రమ కట్టడాలు కట్టడంతో వరద నీరు బయటికి పోకుండా నివాస ప్రాంతాల్లోకి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షానికి లోతట్ట ప్రాంతాలైన లడక బజార్ ముస్లిం కాలనీలోని పలు గృహాల్లోకి వర్షపు నీరు చేరింది. భారీ వర్షాలకు మండలంలోని దేశినేనిపాలెం గ్రామంలో ఎస్సి కాలనీలోని పలు గృహాల్లోకి వర్షపు నీరు చేరుకుంది. మరో రెండు మూడు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు రాంబాబు సిఐ మురళి పేర్కొన్నారు.