పన్నులు చెల్లించి కార్పొరేషన్ అభివృద్ధికి తోడ్పడాలి మేయర్ సామల బుచ్చిరెడ్డి

Published: Friday September 30, 2022
మేడిపల్లి, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి)
సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి తోడ్పడాలని మేయర్  సామల బుచ్చిరెడ్డి సూచించారు. 10వ డివిజన్ న్యూ హేమా నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో మేయర్ సామల బుచ్చి రెడ్డి పాల్గొని డివిజన్లోని పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ మంజులత   పాల్గొని పన్నులు చెల్లించడంలో ఆలస్యం చేయకూడదని పన్నులపై ప్రభుత్వం వడ్డీ పై రాయితీని కల్పించిందని, సద్వినియోగం చేసుకొని అక్టోబర్ 31 కల్లా పన్నులు చెల్లించాలని  తెలిపారు. డివిజన్లో వాటర్ లైన్ సరిగా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని,  వాటర్ బోర్డు మేనేజర్ మమతతో మేయర్ మాట్లాడి నీటి సమస్య లేకుండా కొత్త లైన్ వేయాలని ఆదేశించారు. అనంతరం తడి, చెత్త పొడి చెత్త వేరు చేసే కార్యక్రమంలో భాగంగా ఐటీసీ సంస్థ వారు  చేయుచున్న అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, దొంతర బోయిన మహేశ్వరి కృపసాగర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు 
బొమ్మక్ బాలయ్య, డివిజన్ అధ్యక్షులు వెల్లంకి శ్రీనివాస్, ఆర్ ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.