ప్రగతిపాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Published: Thursday March 09, 2023
     రాయికల్, మార్చి08;(ప్రజాపాలన ప్రతినిధి):    
 
రాయికల్ ప్రగతి ఉన్నత పాఠశాలలో బుధవారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు లేనిదే ప్రపంచం లేదని మహిళలను గౌరవించుకోవటం మనందరి బాధ్యత అని, మహిళా లేకుండా సృష్టి లేదని, మహిళే ప్రపంచానికి మూలాధారం అని, ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ బాలె శేఖర్ కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ రాలులను అందరిని ఘనంగా సత్కరించటం జరిగింది. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి బాలె జయశ్రీ, డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.