ప్రమాదం పొంచి ఉన్న నారాయణపురం (పోసారం) చెరువు సమాచారం ఇచ్చిన చెరువు వైపు తిరిగి చూడని అధికార

Published: Wednesday July 13, 2022

బోనకల్, జులై 13 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని నారాయణపురం (పోసారం) చెరువు ప్రమాదపు అంచున పొంచి ఉన్నది. రైతులు తెలిపిన వివరాలు ప్రకారం గత 5,6 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువు కట్ట తెగే ప్రమాదం ఉన్నదని రైతులు అనుమానిస్తున్నారు. కట్టనుండి మట్టి జారుతుందని, చెరువు కట్ట లో అక్కడక్కడ నీరు లీక్ అవుతుందని, దీనివలన కట్ట తెగే ప్రమాదం ఉందని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు కింద నారాయణపురం, ఆళ్లపాడు, మోటమర్రి గ్రామాల కింద దగ్గర దగ్గర 1500 ఎకరాలు పంట పండిస్తున్నారని రైతులు ఈ కట్ట తెగితే ఈ 1500 ఎకరాల రైతులకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆవేదన చెందుతున్నారు. చెరువు కట్ట తెగే ప్రమాదం ఉన్నదని అధికారులకు తెలియజేసిన ఇంతవరకు వచ్చి చూడలేదని, ఎందుకు ఈ అధికారులకు ఇంత నిర్లక్ష్యమని, కట్ట తెగి రైతులకు నష్టం వాటిలితే దీనికి బాధ్యులు అధికారులేనని ఆవేదన చెందుతున్నారు. రైతులు చెరువు కట్ట ఎక్కడానికి దారి లేకుండా ముళ్ళ చెట్లతో గుబురుగా ఉన్నాయని, దీనిని అధికారులు గాని, పంచాయతీ వారు గానీ పట్టించుకోవడంలేదని రైతులు చెబుతున్నారు. చెరువుకు మరమ్మత్తులు చేసే అవకాశం ఉన్నా సరే అధికారులు ఎన్నడూ తిరిగి చూసిన పాపాన లేదంటున్నారు. భారీ వర్షం కురిసినచో చెరువు కట్ట తెగి భారీ నష్టం వాటిల్లే పరిస్థితి ఉన్నదని,చెరువు కింద కొన్ని వందల ఎకరాలు ఉన్నాయని చెరువు తెగితే వందల ఎకరాలు రైతులు నష్టపోతారని ఆవేదన చెందుతున్నారు. కట్ట తెగితే ఎవరూ ఏమీ చేయలేరని రైతులు చెబుతున్నారు. చెరువుకట్టనుండి మట్టి జారుతుండడం చూసి రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి చెరువు కట్టకు మరమ్మత్తులు చేసి కట్ట తెగిపోకుండా రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.