విద్యాసంస్థల బందును పాటించండి ఎమ్మార్పీఎస్ నాయకుల విజ్ఞప్తి

Published: Tuesday August 23, 2022
బెల్లంపల్లి ఆగస్టు 22 ప్రజా పాలన ప్రతినిధి: రాజస్థాన్ రాష్ట్రంలో శిశు మందిర్ పాఠశాలలో చదువుకునే మూడవ తరగతి విద్యార్థి,మేగ్వాల్ అందరూ త్రాగే  మంచినీళ్లను దళిత విద్యార్థి తాగాడని స్కూల్ టీచర్ కిరాతకంగా కొట్టి హింసించడంతో చనిపోయిన  సంఘటనకు నిరసనగా మంగళవారం నాడు పాఠశాలలు బందుకు రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన సందర్భంగా పిలుపుకు అందరూ సహకరించి బందును విజయవంతం చేయాలని, బెల్లంపల్లి పట్టణ ఎమ్మార్పీఎస్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంటుంటే, ఈ దేశంలో అంటరానితనం దళిత ప్రజలను ఎంత వేధిస్తున్నాయో ఈ సంఘటనతో అర్థమవుతుందని అన్నారు. ఈ సంఘటనపై ఈ దేశ ప్రధాని ఒక ప్రక్కన కూడా చేయలేదని, తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావ్రుతం కావని నమ్మకమేంటని వారు ప్రశ్నించారు.
 
ఇప్పటికైనా ప్రధానమంత్రి మౌనం వీడి ఒక ప్రకటన చేయాలని, దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, మెగ్వాల్ కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో  జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాలు తీసుకొని నిరసన తెలుపుతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జనగామ మల్లేష్, రత్నం ఐలయ్య, నక్క కృష్ణ, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు