పాఠశాల అభివృద్ధి పనులు ప్రారంభించిన సిఎల్పీ నేత

Published: Thursday February 02, 2023
 బోనకల్, ఫిబ్రవరి 1 ప్రజా పాలన ప్రతినిధి: మండల లోని ఆళ్ళ పాడు గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు మన ఊరు మన బడి నిధుల నుండి మంజూరీ అయిన అభివృద్ధి పనులను మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు.ముందుగా ఆయనకు పాఠశాల విద్యార్థులు,గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ పాఠశాల పాలకవర్గం,సిబ్బంది ఘన స్వాగతం పలికారు,విద్యార్థుల తో కలిసి తరగతి గదులు పరీక్షించారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ..రంగులేసిన అంత మాత్రాన పాఠశాల అభివృద్ధి అనుకోలేము విద్యార్థులకు సరిపడా బోధనా సిబ్బంది ఉండాలని,విద్య అభివృద్ధి అనేది అంచలంచెలుగా జరుగుతుందని,నాడు విద్య లేని వాడు వింత పశువు అనే వాళ్ళమని,ఉసికెలో దిద్దిన దగ్గర నుండి డిజిటల్ క్లాస్ రూం వరకు వచ్చామని,విద్య,వైద్యం అనేది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతని,బోధనా సిబ్బంది లేకుండా విధ్యాబివృద్ధి సాధ్యం కాదని,ఇంతటి ఆవకాశము ప్రభుత్వ పాఠశాలలో ఉంటే కూడా విద్యార్థులు ప్రవేట్ పాఠశాలలకు ఎందుకు వెళ్తున్నారో అందరూ ఆలోచించాలని,ఆళ్ళ పాడు పాఠశాల నందు ఉన్న విద్యార్థులకు తెలుగు మీడియం,ఇంగ్లీష్ మీడియం ఏక కాలంలో బోధన చేస్తున్నాం అని సిబ్బంది చెపుతున్నారు. అలా చేయడం వలన విద్యార్థులకు అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.అందుకే సరిపడా బోధనా,బోధనేతర సిబ్బంది ఉండాలి అప్పుడే పాఠశాలల్లో విద్యాభివృద్ధి జరుగుతుందని, ఉపాధ్యాయులకు నా ముఖ్య విజ్ఞప్తి మీ హక్కుల కోసమా పోరాటం లాగే పాఠశాల బోధనా సిబ్బంది నీ నియమించాలని పోరాటం చేయాలని అన్నారు.రైతులు, పేదలు తమ కష్టం పిల్లలు చేయకూడదు అనే వారు వారి పిల్లలను చదివిస్తున్నారు. నిధుల నుండి కూడా పాఠశాల లకు కోటిన్నర నిధులు ఇచ్చానని,భవిష్యత్ లో డిజిటల్ పాఠశాలలకు కూడా ఇస్తానని ఆ విధంగా పాఠశాల లు వచ్చేలాగ ప్రయత్నం చేస్తానని అన్నారు. పాఠశాల లకు స్కావెంజర్స్ లు ప్రత్యేకంగా ఉండేలాగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
 విద్యార్థులందరు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలని ఈ సందర్భంగా తెలియజేశారు.