*సమ సమాజ నిర్మాణ వైతాళికుడు* *సామాజిక సంఘసంస్కర్త* *పీడిత ప్రజల హక్కుల పితామహుడు* *మహిళల విద్య

Published: Wednesday April 12, 2023
కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త  మహాత్మ జ్యోతిరావ్ పూలే అని చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి కొనియాడారు.  మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకుని చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ....మహాత్మా జ్యోతిరావు పూలే అందించిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, కుల,మత వర్ణ వివక్షతను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడ్డారన్నారు. సమాజంలో మార్పు కోసం పోరాటం ఆరంభించి విద్యాభివద్ధికి దోహదపడ్డ జ్యోతిరావ్‌ పూలే ఆశయాలకు యువత పునరంకితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ గుప్తా, ఉప సర్పంచ్ యాదయ్య మాజీ ఉపసర్పంచ్  టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్,  వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, పంచాయతీ సెక్రెటరీ వెంకట్ రెడ్డి, నాయకులు గజ్జల యాదగిరి, బండారి వెంకట్ రెడ్డి,రవీందర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,వినోద్ గౌడ్,  గ్రామపంచాయతీ సిబ్బంది నరేందర్ రెడ్డి, యాదయ్య, యాదగిరి, శ్రీకాంత్, పాల్గొన్నారు.