బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ రమణ కు సన్మానం

Published: Wednesday February 23, 2022
హైదరాబాద్లో జరిగిన ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ పూజారి రమణను బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానింంచారు. ఈ సందర్భంగా కుల సంఘ నాయకులు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణనికీ చెందిన డాక్టర్ రమణ, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం బీసీ సమాజం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అనేక పదవులు అధిరోహించాలని, అలాగే రాజకీయ రంగాల్లో కూడా రాణించాలని బీసీల పక్షాన ఆకాంక్షిస్తున్నాం అని పేర్కొన్నారు.     కార్యక్రమంలో  తెలంగాణ గంగపుత్ర సంఘం పట్టణ అధ్యక్షులు‌‌  గుమ్ముల శ్రీనివాస్, పద్మశాలి సంఘం నాయకులు వడ్డేపల్లి మనోహర్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు గోవిందారం ప్రభాకర్, జంబో జి శ్రీనివాస్, కాపు సంఘం నాయకులు  బోనగిరి చంద్రయ్య,  గంగపుత్ర సంఘం నాయకులు  మగ్గిడి రాజశేఖర్, పనెం  కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.