ధన్వంతరి జయంతి సందర్భంగా మెగా ఉచిత ఆయుర్వేద శిబిరం

Published: Tuesday October 25, 2022
మధిరఅక్టోబర్23, ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు
జాతీయ ఆయుర్వేద దినోత్సవం ధన్వంతరి జయంతి సందర్భంగా ఆదివారం పట్టంలోని సత్యసాయి సేవా సమితి,మధిర సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు గురువు డాక్టర్ నాగభూషణం సమక్షంలో కోనా మోహన్ రావు స్వగృహమునందు మడిమ సూలా, వెన్నునొప్పి, మెడ నొప్పి, మొదలగు రుగ్మతులకు చికిత్స చేసి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా గురువులు డాక్టర్ నాగభూషణం మాట్లాడుతూ.... ఆయుర్వేదిక్ లో ముఖ్యమైనవి కస్తూరి బెండ, పారిజాతం, ఆకులు, అర్జున (తెల్లమద్ది) మొదలగు మందులుతో నొప్పులు, జ్వరాలు, గుండె సంబంధ వ్యాధులు, పనిచేస్తాయని ఆయుర్వేదంలో ఔషధాలకుప్రతిచెట్టుఉపయోగపడుతుందని దాని ద్వారా అవసరాలు తయారు చేసుకోవచ్చని అదేవిధంగా ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఊరు బయట రావి చెట్టు పెంచాలని తద్వారా వాయు కాలుష్యం బారిన పడకుండా ఉంటామని అన్నారు.
ఆదివారం నిర్వహించిన వైద్య శిబిరంలో 100 మందికి వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేసి, మందుల ప్రభావం గురించి  అవగాహన చేసినారు ఈ శిబిరంలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ భాను ప్రసాద్ గారి నిర్వహణలో*
ఈ ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంపులో డాక్టర్ అరుణ కుమారి, డాక్టర్ కృష్ణారావు,డాక్టర్ ఏ రాంబాబు,డాక్టర్ సత్యనారాయణ ప్రముఖు వైద్యులచే శిబిరం విజయవంతం చేసినారు. ఈ శిబిరంలో   ఎండిఓ కుడుముల విజయ భాస్కర్ రెడ్డి, సత్యసాయి సేవా సమితి వైద్య శిబిర నిర్వహకులు కోనా మోహన్ రావు, ఆయుర్వేదిక్ వైద్య సహాయకులు అనంతయ్య, మదిర సేవాసమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు, కోట రంగారావు, పెరుమళ్ళ దుర్గాదేవి, సత్యనారాయణ, మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు, కోమటిడి శ్రీనివాసరావు, యర్రా లక్ష్మణ్, వందనపు శ్రీనివాసరావు, కోమటి సుధాకర్, పబ్బతి రమేష్, కోన నరసింహ రావు, లంకా కొండయ్య, చలువాది కృష్ణమూర్తి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్, వేముల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.