ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను పరిశీలించిన కేంద్ర బృందం

Published: Thursday February 02, 2023

శంకరపట్నం జనవరి 31 ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండల కేంద్రం లోని ప్రాదామిక ఆరోగ్య కేంద్రంను 2 రోజులుగా తానిఖి నిర్వహించినా జాతీయ నాణ్యత అంచనా బృంధం
ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల సేవలు అభినందనీయంగా ఉన్నాయని మంగళవారము ఏర్పటు చేసినా సమావేశంలో కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ అబ్దుల్ ఆఫీజ్ అన్నారు. కేంద్ర బృందం సభ్యులు శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, 108 వాహన వైద్య సేవలను, మండల పరిధిలో పలు గ్రామాల్లో ప్రభుత్వ వైద్యశాలలు అందిస్తున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో సోమ, మంగళవారలలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను మండల ప్రాథమిక వైద్య అధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో అందుతున్నాయని, తమ క్షేత్రస్థాయి పరిశీలనలో వెళ్లడైందని, ప్రభుత్వ వైద్యశాల సేవలు, వైద్య సిబ్బంది పనితీరు, వైద్యశాల పరిసరాలు, సౌకార్యాలు బాగుండడం అభినందనీయమన్నారు. మండల ప్రజలు ప్రభుత్వ వైద్యశాల సేవలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని కేంద్ర బృందం సభ్యులు మండల ప్రజలకు సూచించారు. ఈ రోజు కేంద్రం బృంద సబ్యురాలుకి స్థానిక ఆశా కార్యకర్త లలిత హిమోగ్లోబిన్ పరీక్ష చేసి వారి మన్ననలు అందుకొన్నారు.ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో జుబేరియా, హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో చందు, కేంద్ర బృందం సభ్యురాలు డాక్టర్ జ్యోతి సిoలోట్, మండల వైద్య అధికారి వేణుగోపాల్, ఫార్మసిస్ట్ మతిన్, వైద్యశాల సిబ్బంది సంధ్యారాణి, ఉమా, వెంకటలక్ష్మి, ఇందిరా, తదితరులు ఉన్నారు.