దెందుకూరు పిహెచ్సిని సందర్శించిన ఎంపీడీఓ మధిర రూరల్

Published: Saturday November 19, 2022

నవంబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి మండలంపరధిలో ఉన్న పిహెచ్సి దెందుకూరును  ఎంపీడీఓ కె విజయభాస్కర్ రెడ్డి శుక్రవారం పిహెచ్సి దెందుకూరును ఆకస్మికంగా విజిట్ చేసి పిహెచ్సి వైద్యులు డా. శశిదర్ ను ఫీల్డ్ సిబ్బంది వివరాలు అడిగి తెలుసు కున్నారు. అదేవిధంగా పిహెచ్సి లో ఓపిసేవలు గ్రామాల్లో మెడికల్ క్యాంపులు గురించి వైద్యులతో మాట్లాడినారు. ప్రతి గ్రామంలో మంగళవారం శుక్రవారం డ్రైడే కార్యక్రమం జిపి సిబ్బందితో కలిసి బృందంల వారీగా నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే ఈ నెలలో నాల్గు డెలివరీలు చేసినారు అని ఈ నెల కొరకు ఇంకా కొన్ని డెలివరీ అయ్యేటట్లు చూడాలి అని శశిదర్ ఎంపీడీఓ వివరంగా చెప్పారు. పిహెచ్సి పరిధిలో సూపర్ వైజర్ స్టాఫ్ వారి డ్యూటీ చార్టుల ప్రకారం ఫీల్డ్ లో వున్న విషయం ఎంపీడీఓ  తెలుసు కున్నారు ఈ కార్యక్రమం పిహెచ్సి సిబ్బంది పిహెచ్ఎన్ గోలి రమాదేవి  మధిర 1సబ్ సెంటర్  లాడక్ బజర్  హెచ్ఇఒ యస్ గోవింద్ మహాదేవపురం రాయపట్నం పిహెచ్ఎన్ పద్మావతి దెందుకూరు బీసీ కాలనీ హెచ్ఎస్ సుబ్బలక్ష్మి మధిర 1సబ్ సెంటర్ ఎర్యాలో ఎస్సి కాలనీ లో హెచ్ఎస్ లంకా కొండయ్య ఖమ్మంపాడులో డ్రై డే కార్యక్రమంతో పాటు వారికీ కేటాయించిన నేషనల్ హెల్త్ ప్రోగ్రాంల్లో వున్నట్లు తెలుసు కున్నారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ  ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమగ్ర ఆరోగ్య సేవలు అందించాలి అని వివరించారు. అనంతరం ఖమ్మంపాడు గ్రామంలో ఎంపీడీఓ వివిధ అభివృద్ధి పనులు జిపి సిబ్బంది ద్వారా పరిశీలనచేసి సూచనలు ఇచ్చారు.