నిరసన దీక్ష చేపట్టిన జనంపల్లి అనిరుద్ రెడ్డి

Published: Tuesday September 13, 2022

ప్రజా పాలన. ప్రతినిధి. సెప్టెంబర్.12 నవాబు పేట్ మండల కేంద్రంలో      .సరైన లబ్దిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా సరిగ్గా పింఛను ఇవ్వలేని ప్రభుత్వాన్ని కూల్చేద్దాం అని జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమన్వయకర్త అనిరుద్ రెడ్డి అన్నారు.సోమవారం నవాబ్ పేట మండల కేంద్రము లో అంబేద్కర్ చౌరస్తాలో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడారు.గడిచిన ఎనిమిది సంవత్సరాల పాటు తన కుటుంబ సభ్యుల సంపాదన మాత్రమే పెంచుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేవు అని అన్నారు.ప్రజలు ఇకనైనా మారండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలకమైన పాత్ర పోషించింది అని అన్నారు.తల్లి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అని అన్నారు.ఆంద్రాపాలకుల విముక్తి కోసం పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ దొరల పాలన గా మారింది అని వాపోయారు.ఎన్నికలలో ఇచ్చిన హామీలను మరిచి కమీషన్ల కోసం ప్రాజెక్టు ద్వారా కోట్ల రూపాయల దుర్వినియోగం చేయడమే వారి లక్ష్యం అని అన్నారు.ఇళ్ళులేని నిరుపేద కుటుంబానికి రెండు పడకల ఇళ్ళు కట్టిస్తామని, దళితులకు మూడు ఎకరాల భూమిని మరిచిపోయారు అని అన్నారు దళిత బంధు, రైతు బంధు పతకాలు పేదలకు ఒరిగేదేమీ లేదు అని అన్నారు.రైతులకు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేద్దాం అని అన్నారు.టీఆరెస్ నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో గ్రామాలలో పేధ రైతులకు అన్యాయం జరిగిందని అన్నారు. ప్రజలకు మెరుగైన విద్య ,వైద్యం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్. జడ్చర్ల  కాంసెన్సీ  కాంగ్రెస్ మహిళా కమిటీ అధ్యక్షురాలు  మీనాక్షి . యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు  వాసు యాదవ్. ప్రధాన కార్యదర్శి మల్లేష్ .నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువత ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు. మండల కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ  ఆకుల అమరేశ్వర్ .   యంపీటీసీలు తులసీ రాం. నర్సింహులు. నవాజ్ రెడ్డి. కొల్లూరు గ్రామ ఉప నర్సింహ చారి. వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు