జిల్లాల్లో మరోసారి బారీ వర్షాలు కురిసే అవకాముంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డా. రాజేశ్వర్ న

Published: Saturday August 06, 2022

 

బెల్లంపల్లి ఆగస్టు 5 ప్రజా పాలన ప్రతినిధి: రానున్న ఐదు రోజుల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, కోఆర్డినేటర్, సైంటిస్ట్  డాక్టర్, రాజేశ్వర్ నాయక్ తెలిపారు.
శుక్రవారం నాడు ఆయన పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. 
వర్షాకాలం మొదలై రెండు నెలలు కావస్తున్న , ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షాలు జిల్లాలో నమోదు అయినాయని, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 560 మిల్లీలీటర్ల సాధారణ వర్షపాతంకు గాను దాదాపు 1150 (105% అధికం) మిల్లీమీటర్ల వర్షపాతం అధికంగా నమోదవడం జరిగిందినీ, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో  570 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 1070 మిల్లీమీటర్లు (84% అధికం) వర్షాలు కురవడం జరిగిందినీ తెలిపారు, 
గత నాలుగైదు రోజులుగా వర్షాలు పడటం కొద్దిగా తగ్గుముఖం పట్టిన, మళ్లీ పెరిగే అవకాశం ఉందనీ వాతావరణ కేంద్రం హైదరాబాద్ నుండి  సమాచారం అందిస్తున్నారని, దాని  ప్రకారం రానున్న  ఐదు రోజుల్లో మంచిర్యాల, మరియు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుండి అతి భారీ వర్షాలు  నమోదయ్య అవకాశం ఉందనీ, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు