ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న, పోస్టులలో విద్యావలంటీర్లను నియమించాలి

Published: Wednesday September 15, 2021
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 14, ప్రజాపాలన ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న, పోస్టులలో వెంటనే విద్యావలంటీర్లను నియమించాలని అలాగే స్కావెంజర్ లను పూర్తి టైం పాఠశాలలో ఉంచాలని ఈరోజు ఎర్రుపాలెం మండలం ఎం డి ఓ గారికి గారికి ఎం ఈ ఓ గారికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎర్రుపాలెం మండల కమిటీ ఆధ్వర్యంలో మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం మండల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అనుమోలు కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎర్రుపాలెం మండలంలో 37 ప్రాథమిక 8 ప్రాథమికోన్నత 9 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి ఈ పాఠశాలలో మొత్తం విద్యార్థులు 3241 మంది చదువుతున్నారు ఇంకా పాఠశాలలో అడ్మిషన్స్ పెరుగుతూ  ఉన్నాయి ఎర్రుపాలెం మండలంలో 14 స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు కూడా లేరు ప్రస్తుతం వాటిలో ఉన్నటువంటి  ప్రాథమిక పాఠశాల నుంచి ఒక్కొక్కరిని పంపించగా ప్రస్తుతం 25 ప్రాథమిక పాఠశాలలో ఒక్కొక్క పాఠశాలలో ఒకే ఒక ఉపాధ్యాయుడు పని చేయడం జరుగుతుంది దీనివలన విద్యార్థులకు ఎటువంటి విద్య అందటం లేదు ఉపాధ్యాయుల మీద పని భారం బాగా పెరుగుతుంది అలాగే 9 హై స్కూల్ లో 6 స్కూల్ లో  ఐదుగురు లోపు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు  రెండు హైస్కూలులో తప్ప మిగిలిన ఏడు హై స్కూల్స్ లో ప్రధానోపాధ్యాయుడు లేరు 8 ప్రాథమికోన్నత పాఠశాలలో రెండు పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు కూడా లేరు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ ఫీజులు అధిక భారంతో ప్రభుత్వ విద్యా రంగం వైపు మొగ్గుచూపుతున్నారు విద్యార్థుల సంఖ్య నానాటికి  పెరుగుతున్నది వీటికి అనుగుణంగా ఎర్రుపాలెం మండలంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వెంటనే విద్యా వాలంటీర్లు నియమించి  మండలం ప్రభుత్వ పాఠశాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మండల వనరుల కేంద్రం కంప్యూటర్ ఆపరేటర్ మల్లికార్జున కు మెమోరాండం ఇవ్వడం జరిగింది అలాగే గత సంవత్సరం దాకా స్కావెంజర్ లను గవర్నమెంట్ ప్రత్యేకంగా నియమించింది ఇప్పుడు పంచాయితీలకు అప్పగించింది దీనివల్ల పంచాయితీ సర్పంచులు మాకు ఆర్థిక భారం పెరుగుతుందని వాపోతున్నారు కావున వెంటనే ప్రభుత్వం గతంలో లాగ స్కావెంజర్ లను నియమించాలని లేనిపక్షంలో  పూర్తిస్థాయిలో పాఠశాలల్లో పనిచేసే విధంగా స్కావెంజర్ ఉంచాలని ఎం డి ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో యు టి ఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండారు నాగరాజు అనుమోలు కోటేశ్వరరావు ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ మహిళా కార్యదర్శి వై నాగమణి నాయకులు రాజారావు వై చిన్ని ఎం నాగేశ్వరరావు  హనుమంతు రావు తదితరులు పాల్గొన్నారు...