రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం

Published: Thursday February 10, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 09 ఫిబ్రవరి ప్రజాపాలన : రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విమర్శించారు. బుధవారం వికారాబాద్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఎంఆర్పి పెట్రోల్ పంపు వరకు పాదయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ తీసి ఎన్టీఆర్ చౌరస్తాలో నరేంద్రమోడీ దిష్టి బొమ్మ దహనం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి, ఉద్యమ పోరాటాలు చేసి రాజ్యాంగ బద్దంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర విభజన పై అదే పార్లమెంట్ లో తప్పుగా మాట్లాడటం సిగ్గుచేటని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజానికానికి బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చేయూతను అందించాల్సింది పోయి, బడ్జెట్ లో కోతలు విధిస్తూ అన్యాయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించని కేంద్ర ప్రభుత్వం ఇలా మాట్లాడటం హేయనీయమైన చర్య అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉండి రాష్ట్ర వాటా ఇవ్వడం చేతకాని మోడీ అడ్డగోలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని తెలంగాణ జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం శివారెడ్డి పెట్ పిఎసిఎస్ చైర్మన్ మసన గారి ముత్యంరెడ్డి ఏఎంసి వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ల పల్లి రమేష్ కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కో ఆప్షషన్ సభ్యులు జెడ్పిటిసి మాజీ చైర్మన్ ముత్తహర్ షరీఫ్ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కైల ఉపేందర్ రెడ్డి సుభాన్ రెడ్డి ఎన్నేపల్లి షఫీ హరితేజ ముదిరాజ్ కార్యకర్తలు పాల్గొన్నారు.