అన్యాయంగా మా ఇల్లును కూల్చేవేశారు

Published: Wednesday June 15, 2022
రామిళ్ల ఆశయ్య
 
మంచిర్యాల టౌన్, జూన్ 14, ప్రజాపాలన : అన్యాయంగా  ఇల్లును కుల్చరని జిల్లా కలెక్టర్ ఏ ఓ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
 లక్షేట్టిపేట్ మండలంలోని గుల్లకోట గ్రామ పంచాయతీ పరిధిలోని మిట్టపల్లి గ్రామంలో ఇంటి నెంబర్ 8-183 లో నివాసం ఉంటున్న రామిళ్ల ఆశయ్య తండ్రి:  పోచయ్య.  గుల్లకోట గ్రామ పంచాయతీ రికార్డు నందు 2007 సంవత్సరం నుండి 2018 వరకు ఉన్నాం, తర్వాత మిట్టపల్లి నూతన గ్రామ పంచాయతీ గా ఏర్పడింది. ఆ ఇంటిని  రికార్డు లో చేర్చమని  గ్రామ పంచాయతీ కార్యదర్శి  పలుమార్లు  కలసిన నమోదు చేయలేదని చెప్పారు. ఎలాంటి ముందస్తు నోటీసు లు ఇవ్వకుండా సోమవారం రోజున గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల ఎంపీడీఓ వచ్చి, ఉన్న ఇంటిని కూల్చివేశారు. వెంటనే ఈ కూల్చివేత పై  విచారణ చేసి పంచాయతీ కార్యదర్శి, మండల ఎంపీడీఓ  పై తగు చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.