ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ టీమ్ కు ఎంపికైన తెలుగు తేజాలు

Published: Saturday November 05, 2022
ప్రజా పాలన-, శేరిలింగంపల్లి నవంబర్ 4 న్యూస్: ఇంటర్నేషనల్ వాలీబాల్, మరియ బీచ్ వాలీబాల్ ప్లేయర్స్ అయిన భేల్ జ్యోతి విద్యాలయా హై స్కూల్ పూర్వ విద్యార్థి అయిన కృష్ణం రాజు, మరియు నరేష్ లు కస్టమ్స్ అండ్ సెంట్రల్ టాక్స్ జి ఎస్ టి లో ఇన్స్ పెక్టర్లు గా హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుండి వాలీబాల్, బీచ్ వాలీబాల్ క్రీడపై దృష్టి పెట్టి నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఎన్నో విజయాలతో ఎన్నో పథకాలు సాధించి తెలుగు రాష్ట్రాల తో పాటు, దేశానికి మంచిపేరు, పథకాలు సాధించి పెట్టారు. ఈ నెల 7 నుండి 11 వరకు
ఇరాన్‌లో జరిగే సీనియర్ ఆసియా బీచ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు, మరియు 14 నుండి 17 వరకు ఆసియా వాలీబాల్ కాన్ఫిడరేషన్ మరియు ఇరాన్ వాలీబాల్ ఫెడరేషన్ నిర్వహించే పోటీలకు ఇండియా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు వారు తెలిపారు. అక్కడ కూడా విజయాలు సాధించి పథకాలతో తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.విజయంతో తిరిగి రావాలని వారి స్నేహితులు, గురువులు, బంధువులు తోటి క్రీడాకారులు ఆకాంక్షిస్థున్నారు.