దహన సంస్కారాల వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం : ఎమ్మెల్యే సంజయ్

Published: Tuesday January 11, 2022
జగిత్యాల, జనవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణంలోని చింతకుంట స్మశానవాటికలో టియుఎఫ్ఐడిసి మరియు 14 ఎఫ్ సి నిధులు 1.14 కోట్లతో నిర్మించిన అభివృద్ధి పనులను సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జి.రవి, జెడ్పి ఛైర్పర్సన్ దావా వసంత సురేష్, మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్ ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవప్రదంగా హిందూ సాంప్రదాయ ప్రకారం స్మశాన వాటికలు కావలసిన అన్ని వసతులు ఏర్పరిచి స్మశాన వాటికను ఆధునీకరించి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి మనిషి చివరి మజిలీ వైకుంఠ దామం మాత్రమేనని, గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితికి కారణమని, నేడు వైకుంఠధామం ఆధునీకరణ మౌలిక వసతులు ఏర్పాటు ద్వారా సుందరంగా మార్చుకు న్నామని దహన సంస్కారాలు వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని రకాల సదుపాయాలు ఇల్లు లేనివారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఆస్తిక భద్రపరిచే గది, పూజగది, పచ్చదనం, వంట గది, స్త్రీ, పురుషుల మరుగుదొడ్లు ఇలా అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అని అన్నారు. గ్రంథాలయ చైర్మెన్ మాట్లాడుతూ ఈనాడు స్మశాన వాటిక లను జగిత్యాల పట్టణంలో అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్ది ఇక్కడికి వచ్చిన ప్రజలు కొంతసేపు సేద తీరే విధంగా పచ్చదనంతో ఇల్లు లేనివారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఉన్నాయని చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, ఆర్డిఓ మాధురి, మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు మొహమ్మద్ రాజీద్దీన్, బాలె లత శంకర్, మేక పద్మావతి పవన్, పంబాల రాము, తెరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, గౌరవ కౌన్సిలర్లు అవారి శివకేసరి బాబు, జంబర్తి రాజ్ కుమార్, బొడ్ల జగదీష్, కప్పల శ్రీకాంత్, కోరే గంగమల్లు, చుక్క నవీన్, కో.అప్షన్ మెంబర్ వడకపురం శ్రీనివాస్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, అరుముళ్ల పవన్, కొత్తకొండ అంజయ్య, వొద్ది రాము, కూతురు శేఖర్, ఆనంద్ రావ్, వొళ్ళెం మల్లేశం, మున్సిపల్ అధికారులు, నాయకులు, వివిధ కుల సంఘ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.