ఆర్గనైజేషన్ కమిటీ సమావేశం

Published: Wednesday March 23, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 22 ప్రజాపాలన ప్రతినిధి : ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పట్నం కమిటీ కన్వీనర్ డీజీ నరసింహారావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉన్న మాసబ్ ట్యాంక్ చెరువును సుందరీకరణ చేయాలి చెరువులో డ్రైనేజ్ వాటర్ కలవకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని సందర్శించడానికి అనేక ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తుంటారు ఉదయం పూట వాకింగ్ చేసే టందుకు ఈ ఇచుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేకమంది ప్రజలు వస్తుంటారు కనుక చెరువులో చెత్తాచెదారం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెరువు విస్తీర్ణం ఎంత ఉందో అంతా వెలికి తీయాలని మూసుకుపోయిన చెరువు తూములను చెరువు కింద ఉన్న కాలువలను నాలలను వెలికితీసి రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్నం కమిటీ రంగారెడ్ది జిల్లా నాయకులు సి.శోభన్, ఎన్. రాజు, యాదయ్య, ప్రకాష్ కరత్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ సీపీఎం కన్వీనర్ డి.కిషన్, ఇల్లూరి భాస్కర్, బి.యాదగిరి, బి.మాలాద్రి టి.ఎలీషా మస్కు చంద్రయ్య, సంజీవ తదితరులు పాల్గొన్నారు.