మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Tuesday March 09, 2021
మేడిపల్లి, మార్చి8 (ప్రజాపాలన ప్రతినిధి) : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిపల్లిలోని (మేయర్ క్యాంప్ ఆఫీస్) పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి మహిళాలను ఘనంగా సత్కరించి, వారికి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నిర్మల, సావిత్రి, వివిధ కాలనీల మహిళలు, కార్పొరేటర్లు కౌడే పోచయ్య, ఎంపల్ల అనంత్ రెడ్డి, కేతావత్ సుభాష్ నాయక్, నాయకులు మనోరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.