జన్నారం అటవీ డివిజన్లో ఇదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

Published: Tuesday December 27, 2022

జన్నారం, డిసెంబర్ 26, ప్రజాపాలన: ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం అటవీ డివిజన్లో యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా పెట్రేగిపోతుంది అక్రమ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఖానాపూర్ నియోజకవర్గ జన్నారం మండలంలోని కవ్వాల్ అటవీ ప్రాంతం, వాగులు, గోదావరి నది, ప్రవహిస్తున్నాయి. ఈ అటవీ ప్రాంతం వాగులు నదుల్లో పుష్కలంగా ఇసుక ఉండడంతో ఇసుక మాఫియా ఇసుక కాజేసేందుకు చేసేందుకు రంగంలోకి దిగింది. తొలిత అభివృద్ధి పనులతో పేరుతో ఇసుక మాఫియా అధికారులను మజ్జిగ చేసుకుని ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టవలసిన  మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు నిద్ర నటిస్తున్న తో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు గతంలో ట్రాన్స్పోర్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదులు అందుకున్న ట్రాన్స్పోర్ట్ పోలీసులు వరుసగా దాడులు చేయడంతో కొద్ది కాలం పాటు జన్నారం అటవీ డివిజన్లో ఇసుక అక్రమ రవాణా ఆగిపోయింది. గత కొద్ది నెలలుగా జన్నారం అటవీ డివిజన్లో ఇసుక అక్రమ రవాణా భారీగా కొనసాగుతుంది. జన్నారం మండలంలో అటవీ ప్రాంతం, వాగులు, నదులు నుండి భారీ స్థాయిలో ట్రాక్టర్ల ద్వారా రహదారి గుండా అక్రమంగా ఇసుక రవాణా తరలిపోతుంది. అదేవిధంగా మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, పొనకల్, గ్రామాల నుండి ఇసుక భారీ స్థాయిలో ఇతర జిల్లాలకు మండల కేంద్రానికి అక్రమ రవాణా కొనసాగుతుంది. మండలంలోని కొన్ని గ్రామాలలో అక్రమ ఇసుక రవాణా చేసి డంపులు గా నిల్వ ఉంచుతున్నారు. అభివృద్ధి పనుల పేరుతో ట్రాక్టర్ యజమానుదారులు తీసుకుంటున్న ఇసుక మాఫియా ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్నారు. ఇసుక అదనంగా తీసుకెళ్లేందుకు రెవెన్యూ, అటవీ శాఖ, మైనింగ్ శాఖ, పోలీసుల  శాఖలకు సుఖ మాఫియా భారి నారజానలు అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రచారానికి తగ్గట్టు ఆయా శాఖల అధికారులు ఇసుక అక్రమంగా తరలిపోతున్న అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రోజు రోజుకి పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలను భరించలేక ఇటీవల మండలంలోని గ్రామాల ప్రజలు ఇసుక ట్రాక్టర్లకు అడ్డం తిరిగి వాటిని పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించిన పై స్థాయి అధికారుల అండతో వెంటనే విడుదల చేయడం జరుగుతుంది. స్థానిక అధికారులు ప్రతిరోజు వందల సంఖ్యలో జన్నారం అటవీ డివిజన్ నుండి ఇతర జిల్లాలకు అక్రమ ఇసుక ఎలా వెళుతుంది, అంటూ మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాత్రిపూట నిరంతరం ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా తరలిపోతున్న ఇసుక రవాణాకు అడ్డుకట్టు వేయాలని జన్నారం ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై అటవీ శాఖ, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ, సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుపుతున్నారు. మండల అటవీ డివిజన్ లలో అక్రమంగా ఇసుక రవాణా అవుతున్నట్లు సమాచారం తెలిస్తే తక్షణమే సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, అటవీశాఖ, మైనింగ్, పోలీస్, శాఖ అధికారులు అంటున్నారు.