19 న జరిగే గంగా హారతి - అఖండ జ్యోతి ప్రజ్వలన జయప్రదం చేయండి

Published: Thursday November 18, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం, ఈ నెల 19 న ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో జరిగే గంగాహారతి- రాచకొండలో వెలసిన శివయ్యకు జ్యోతి ప్రజ్వలనకు మహోత్సవానికి నియోజకవర్గ ప్రాంత ప్రజలంతా కదలి వచ్చి ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించాలని వీరపట్నం అఖండ ట్రస్ట్ చైర్మన్ సదా వెంకట రెడ్డి అన్నారు. అనంతరం ఆయన ఇబ్రహీంపట్నం కట్ట పైన ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ వీరపటం అఖండ ట్రస్ట్  మహాసంకల్పం, వీరపట్నం పెద్దచెరువు పరిసర ప్రాంతాలు సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ 2015 సంవత్సరం నుండీ వీరపట్నం పెద్దచెరువులో గంగమ్మకు హారతి_ రాచకొండలో స్వయంభువుగా వెలసిన శివయ్యకు అఖండజ్యోతి నిర్వహించబడుతున్నది. ప్రకృతి కనుకరింతతో గత రెండు సంవత్సరాలుగా కురిచిన వర్షాలతో పెద్దచెరువులోకి సమృద్దిగా నీరు రావడం మనందరికీ ఆనందదాయకమని అన్నారు. కనుకరించిన ఆ ప్రకృతికి కృతజ్ఞతతో వీరపట్నం పెద్దచెరువుతో అనుబందం ఉన్న ప్రతీ గ్రామాన్ని ఈ మహాకార్యంలో భాగస్వామ్యం చేయాలనే సదాశయంతో 9 రోజులపాటు అఖండ సంకల్ప యాత్ర నిర్వహించి వందకుపైగా గ్రామలలోని కుటుంబాలనుండి సేకరించిన నూనేతో (తైలం) ఈ యేడు 19.11.2021 శుక్రవారం కార్తీకపౌర్ణమి రోజున సాయంత్రం 4 గం.లకు గంగమ్మకు హారతి వైభవంగా నిర్వహించబడుతున్నది. కావున పెద్దచెరువుతో అనుబందం ఉన్న ప్రతీ హృదయం ఈ గంగాహారతి కార్యంలో బాగస్తులు కావాలని వీరపట్నం అఖండ ట్రస్ట్ ఆహ్వానిస్తున్నదని తెలిపారు. దైవకార్యం, ధర్మకార్యంలో అందరు సామాన్యులే అందరూ సమానులే అంటూ ఆచరిద్దాం అందరం పాల్గొందామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న గంగాహారతి కార్యక్రమం కోసం ఈ ఏడు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న ప్రస్తుత కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆహ్వానించడం జరిగిందని వివరించారు. వీరితో స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర పెద్దలందరికీ ఆహ్వానించి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా అఖండ ట్రస్ట్ సభ్యులు బగ్గవరపు రమేష్ గుప్త, గోగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కాకి శ్రీనివాస్ గౌడ్, బాలచందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.