పుష్ఫ ఆడియో రిలీజ్ గ్రాండ్ సక్సెస్

Published: Thursday December 16, 2021
అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షుడు గడ్డం రవికుమార్ 
మేడిపల్లి, డిసెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : హైదరాబాద్ రామంతపూర్లో రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షుడు గడ్డం రవి కుమార్ ఆధ్వర్యంలో పుష్ఫ ఆడియో రిలీజ్ గ్రాండ్ సక్సెస్ అయినందుకు సంబరాలు జరుపుకున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని సినిమా చరిత్రలోనే ఒక రికార్డు సృష్టిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ రోజు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోనున్నట్లు గడ్డం రవి కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పరిటాల సాంబశివరావు, డీజే సాయి, సంతోష్, మహేష్  తదితరులు  పాల్గొన్నారు.