బూర్గంపాడు జడ్పిటిసి ఆధ్వర్యంలో దసరా కానుక బతుకమ్మ చీరలు పంపిణీ.

Published: Tuesday September 27, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ప్రజా పాలన.  బూర్గంపాడు లో  జరిగినటువంటి కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేదవారికి ఇస్తున్నటువంటి దసరా  కానుక బతుకమ్మ చీరలు పంపిణీ బూర్గంపాడు పేద ప్రజలకు దసరా కానుకగా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుందని, అంతేకాకుండా మరెన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని అందులో భాగంగానే షాదీ ముబారక్ ,కళ్యాణ లక్ష్మి, ఇంటింటికి తాగినీరు, మిషన్ భగీరథ మరియు రైతుబంధు, దళితుల అభ్యున్నతి కోసం  దళిత బంధు ,రేపు రాబోయే కాలంలో గిరిజనులందరికి కూడా పోడు పట్టాలు గిరిజన బంధు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలోజడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత , బూర్గంపాడు ఎమ్మార్వో భగవాన్ రెడ్డి మరియు సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు బూర్గంపాడు ప్రెసిడెంట్ సిరిపురపు స్వప్న, బూర్గంపాడు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, సొసైటీ చైర్మన్ పొడియం  ముత్యాలమ్మ, టౌన్ ప్రెసిడెంట్  సోహెల్ పాషా , షాబీర్ భాష  మరియు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె నర్సిరెడ్డి చుక్కపల్లి బాలాజీ., లలిత రామలక్ష్మి వార్డు సభ్యులు ఇతర టిఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
 
 
 
Attachments area