భద్రాచల పుణ్యక్షేత్రాన్నికి ఉన్న విశిష్టతను తగ్గించడంలో పోటీపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభ

Published: Tuesday April 05, 2022
భద్రాద్రి కొత్తగూడెం (ప్రజాపాలన ప్రతినిధి) : ఎమ్మెల్యే పొదేం వీరయ్య ఆదేశాలు మేరకు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రేస్ పార్టీ సమావేశం మండల& పట్టణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సి సెల్ చైర్మన్ చింతిరేల రవికుమార్ మాట్లాడుతూ ఈ అసమర్థత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అభివృద్ధి విషయంలో దక్షిణ భారత దేశంలోనే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నడయాడిన ఈ భద్రాచల ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో నిర్వీర్యం చేస్తుందని ఘాటుగా విమర్శించారు. కేవలం ఎన్నికలకు మాత్రమే రాముడును వాడుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రదేశాన్ని పర్యాటక పర్యాటక ప్రాంతంగా గుర్తించామని గొప్పలు చెప్పుకోవడంలో గుర్తింపు తెచ్చుకున్నా, అభివృద్ధిలో తగ్గ ప్రయారిటీ ఇవ్వటంలో చిత్తశుద్ధి లేదని అన్నారు, దక్షిణ అయోధ్యలోనే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి చరిత్ర కలిగిన ప్రదేశము ఈ ప్రదేశానికి భక్తులు కోకొల్లలుగా వస్తూ ఉంటారు అన్నారు. ఈ ప్రాంతంలో ముక్కోటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి గొప్ప ఉత్సవాలు, ఇలాంటి ప్రదేశాన్ని అభివృద్ధి విషయంలో గాని ప్రచార విషయాలలో గాని కనీస బాధ్యతలు నిర్వర్తించకపోవడం ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలకే తగును అని అన్నారు. భద్రాచలానికి సుమారు పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే లైను భక్తుల సౌకర్యంర్దమ్ బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం దారుణమన్నారు, ప్రముఖ ఉత్సవాలు జరిగేముందే హడావిడి తప్ప, భద్రాచలన్నీ తిరిగి చూసే నాథుడే లేడన్నారు. బిజెపి ప్రభుత్వ, పన్నుల రూపంలో నోట్ల రద్దురూపంలో, టాక్స్ రూపంలో,జి ఎస్టీ లని రోడ్ టాక్స్ , పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచుకునే పనిలో తప్ప, సామాన్యుడు జీవనానికి ఉపయోగకరమైన విధానానికి బాటలు వెయ్యటంలో వైఫల్యం చెందిందని అన్నారు. ప్రభుత్వంలో ఉంటూ ప్రజా సంక్షేమాన్ని కాపాడవలసిన బాధ్యతగల టీ ఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వారే ధర్నాలు చేస్తూ వారి దిష్టిబొమ్మలు వారే   తగలబెట్టడం, దొంగే దొంగ అని చందాగా ఉందని, ఇది దద్దమ్మ పార్టీ అని అభివర్ణించారు అన్నారు. ఈ సిగ్గులేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ప్రజా సంక్షేమం నిర్వీర్యం అయిందని ఇలాంటి ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వాన్ని కూడగట్టుకొని రెండు పర్యాయాలు గెలిచిన భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో గిరిజన గిరిజనేతర వర్గాలకు జీవన సాపల్యం అయ్యేందుకు ఏటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవని అన్నారు. ఇక్కడి గిరిజనులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వీళ్ళకి ప్రజా సంక్షేమం అందటండంలేదని అన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన మొదటి సంవత్సరంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ప్రభుత్వం తీసుకురావలసిన ముత్యాల తరంబ్రాలను మరచింది. నవమి రోజున సీతారామచంద్ర స్వామి వారి అభివృద్ధికి 100 కోట్లు హామీ మరచింది. టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టి భక్తితో పరవశించి పోతున్నట్లు ప్రజా సోమ్ముతో చూపిస్తున్నారే తప్పా, నిజంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్ల వారు తీరు భద్రాచల నియోజకవర్గ ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది అన్నారు.కచ్చితంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఇస్తానన్న అన్ లిమిటెడ్ బడ్జెట్ను కెసిఆర్ గారు ఇచ్చి, రాముడు యొక్క అనుగ్రహం పొందాలనీ, ఈ సందర్బగా కోరేరు, లేకపోతే చిన్నజియ్యర్ చెప్పినట్లు జరుగుతుందని, రాముడి ఆగ్రహానికి గురి కాక తప్పదని అన్నారు, భద్రాచల రైల్వే లైన్, ఒక కల నరేంద్ర మోదీ సర్కారు తెచ్చిన 2022 బడ్జెట్లో పేద బడుగు వర్గాలకు ఒరిగింది ఏమి లేదని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సి సెల్ చైర్మన్ చింతిరేల రవికుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వ బడ్జెట్,కార్పోరేట్ శక్తులకు అనిల్ అంబానీ లకు కొమ్ముకాసేలా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు  ఆదాయపన్నుల రూపంలో ఉద్యోగస్తుల శ్రమ దోచుకోవడం తప్ప వేరేది లేదని అన్నారు. రైతులకు నిరుద్యోగులకు ఎలాంటి మేలులేని బడ్జెట్ ప్రవేశపెట్టటం దారుణమని అన్నారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికొస్తే కొత్తగూడెంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు సింగరేణి గనులకు నిధులు కేటాయింపు జరగలేదని అన్నారు.శ్రీరామ జన్మభూమి అని పరితపించిపోయే బీజేపీ. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా భద్రాచలం పుణ్యక్షేత్రానికి పర్యటకంగా గుర్తింపు తెచ్చేలాగా నిధులు కేటాయించలేదని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భద్రాచలం కొవ్వూరు పాండురంగాపురం, నుంచి  భద్రాచలం వరకు రైల్వే లైన్ ట్రాక్ కల లాగే మిగిలిపోతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ మాజీ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రేస్ తాండ్ర నరసింహరావు పట్టణ కాంగ్రేస్ సరేళ్ల నరేష్, జిల్లా సెక్రెటరీ బలుసు సతీష్, బంధం శ్రీనివాస గాడ్ యూత్ కాంగ్రేస్ చింతిరేల సుదీర్ కుమార్, సరేళ్ల వెంకేటేష్, తదితరులు ఉన్నారు.