టీఆరెస్, బిజెపి రెండూ పార్టీ లు తోడు దొంగలే

Published: Thursday November 18, 2021

కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు

కోరుట్ల, నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణా రాష్ట్రము లో రైతులు భారత దేశ రైతులు నరేంద్ర మోడీ కేసీఆర్ ల ప్రమేయం ఉన్న గుజరాత్ కు చెందిన ఆధాని అంబానీల చేతుల్లో మోసపోతున్నారుమోడీ కేసీఆర్ ల మధ్య కుదిరిన చీకటి ఒప్పందంలో భాగంగానే మోడీ తెచ్చిన రైతు వ్యతిరేకనల్ల చట్టాల పైన గుట్టు చప్పుడు కాకుండా కేసీఆర్ మద్దత్తు ఇచ్చాడు తెలంగాణాలో భారత దేశంలో రైతులపరిస్థితి ఆగం కావడనికి వీళ్ళు తెచ్చిన ఈ నల్ల చట్టాలు కారణం సమస్యలు తీర్చాలి సిన కేసీఆర్ బండి సంజయ్ లు ధర్నాలు చేస్తాము అని చెప్పి వారి చేతకాని తనాన్ని బయటపెట్టుకోని ప్రజల దృష్టిలో దోశులు అయ్యారు అరవింద్ గారు పసుపు పంటకు మద్దత్తు ధర ఇప్పిస్తా చెరుకు ఫ్యాకటరి స్వంత నిధులతో ప్రారంభం చేస్తా అని రాసి ఇచ్చిన బాండ్ పేపర్ హామీలు ఏమయ్యాయి. గత 70సంవత్సరాలనుండి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో రాష్ట్రములో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసింది రైతు రాజ్యం అంటే ఇలాగే ఉండాలి అన్న పాలనచేసింది కాంగ్రెస్ పార్టీ వర్షాకాలంలో రైతులు పండించిన ధాన్యం రా రైస్ గాను వేసo గి లో బాయ్ల్డ్ (ఉప్పుడు బియ్యం) గా ఉపయోగపడతాయ్ ఇది భారత దేశంలో అందరికి తెలిసిన విషయం అయితే మన స్థానిక పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మాత్రం కేంద్రం బాయ్ల్డ్ రైస్ కోసం రబీ లో వడ్లు కోనము అని చెప్పడం రాష్ట్రము కొనాలి అని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ధర్నా చేయడం రాష్ట్రములో పండించిన పంట ప్రతి గింజ కొంటాం అని చెప్పిన టీఆరెస్ ప్రభుత్వం ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడం కాదా రెండు అధికారపార్టీలు ధర్నాలు చేస్తే మరి ధాన్యం ఎవరు కొనాలి ఇప్పటికైనా రెండు పార్టీలు రాజకీయ ఎత్తు గడలు మాని రైతులను ఆదుకోవాలి కేంద్రం కొత్తగా తెచ్చిన రైతు వ్యతిరేకనల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలి.