షర్మిల అరెస్ట్ అప్రజాస్వామికం టీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం నశించాలి

Published: Wednesday November 30, 2022
పాలేరు నవంబర్ 29 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ను అరెస్ట్ అప్రజాస్వామికం అని పార్టీ మండల అధ్యక్షుడు గుగులోత్ రూప్లానాయక్ ఆరోపించారు. మండల కేంద్రలలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న నాయకురాలను అరెస్ట్ చేయటం సిగ్గుచేటు అన్నారు. షర్మిల కాన్వాయ్ పై దాడి చేసిన టీఆర్ఎస్ నాయకుల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ లో
కేసీఆర్ దౌర్జన్యం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఇలాంటి
బెదిరింపులకు భయపడేది లేదన్నారు. పాదయాత్రలో షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులు చేయటం పనికిమాలిన చర్యగా అభివర్ణించారు. దాడులను తీవ్రంగా ఖండించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ విలేకర్ల సమావేశంలో ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు గుగులోత్ నాగేశ్వరరావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు వీరభద్రయ్య, పట్టణ అధ్యక్షుడు రేలా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.