స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకోవాలి **

Published: Tuesday December 06, 2022
డీఐఈఓ శ్రీధర్ సుమన్ ** 
 
వెరిఫికేషన్ కు కొత్త వెబ్ సైట్ **
 
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 5 (ప్రజాపాలన,ప్రతినిధి) : 
ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్మీడియేట్,డిగ్రీ, విద్యార్థులు స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి (డిఐఈఓ).శ్రీధర్ సుమన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు ఎస్సీ, ఎస్టి, బీసీ,మైనారిటీ విద్యార్థుల రెన్యువల్ దరఖాస్తులపై దృష్టి సారించాలని అన్నారు. ఈ విద్యా సం. స్కాలర్ షిప్ ల వెరిఫికేషన్ కు కొత్త వెబ్ సైట్ ద్వారా వెరిఫై చేసి ఆధార్ అథెంటికేషన్ కు పంపించాలని తెలిపారు.  విద్యార్థుల రెన్యువల్, ఫ్రెష్ స్కాలర్ షిప్ లను ఆన్ లైన్ వెరిఫికేషన్ చేసి, విద్యార్థులచే ఆధార్ అథెంటికేషన్ చేయించాలని, తర్వాత బల్క్ బార్ కోడ్ ప్రింట్ తీసి దరఖాస్తులను సంబంధిత వెల్ఫేర్ అధికారులకు సమర్పించాలని సూచించారు.