పట్టణ ప్రగతి పథకంతో మధిర అభివృద్ధి

Published: Saturday June 11, 2022
జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు*

మధిర జూన్ 10 ప్రజా పాలన ప్రతినిధి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి పథకంతో మధిర పట్టణం రూపురేఖలు మారిపోయాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని  కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో  ఆయన పాల్గొని ప్రసంగించారు ముందుగా పట్టణంలోని 2వ వార్డులో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొని రహదారిపై పేరుకుపోయిన చెత్తను స్వయంగా చీపిరి పట్టుకుని లింగాల కమల్ రాజు తొలగించారు. అనంతరం ఆరు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మధిర ట్యాంక్ బండ పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో మధిర మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. 36 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం ఆరు కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ ఏర్పాటు ఐదు కోట్ల రూపాయలతో సమీకృత మార్కెట్ నిర్మాణం 12 లక్షల రూపాయలతో అంబేద్కర్ విగ్రహం వద్ద ఫౌంటెన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పట్టణంలో పార్కులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గ్రామాలు అభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు నిధులు విడుదల చేసి గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్షాలకు చెందిన కొంతమంది నాయకులు నిధులు విడుదల పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీనిని ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు కెసిఆర్ పాలనలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధమాలు, సిసి రోడ్డు నిర్మాణం మిషన్ భగీరథ ద్వారా గ్రామ గ్రామానికి త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరావు మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత వైస్ చైర్ పర్సన్ శీలం విద్యా లత వెంకటరెడ్డి కమిషనర్ అంబటి రమాదేవి, కౌన్సిలర్లు ఇక్బాల్ వైవి అప్పారావు ఎర్రగుంట లక్ష్మి భరత్ విద్యా సంస్థల అధినేత శీలం వెంకట రెడ్డి, ప్యారి, గుగులోతు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.