ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 14ప్రజాపాలన ప్రతినిధి

Published: Thursday December 15, 2022

*కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి కి నిరసనగా గాంధీభవన్లో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముట్టడికి యత్నం...అడ్డుకున్న పోలీసులు.. కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు.. కాంగ్రెస్ శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు*

*కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి కెసిఆర్ ప్రభుత్వం ఓటమికి సూచన... ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఉలిక్కిపడుతున్న ప్రగతి భవన్ *…
*చిలుక మధుసూదన్ రెడ్డి*

కెసిఆర్ ప్రభుత్వం గత అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయం పై పోలీసులు దాడి చేసి సభ్యులను అరెస్ట్ చేసి రికార్డులు సీజ్ చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం.. టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి  ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్కు చేరుకొని కేసీఆర్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన తెలుపడం జరిగింది.. అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకోగా కేసీఆర్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలుపడం జరిగింది.
ఈ సందర్భంగా *చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ*.. కెసిఆర్ అవినీతి ఆక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తప్పా అని ప్రశ్నించారు...టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిందని వారి కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని ఇది తెలిసి భ్రమలో ఉన్న కేసీఆర్,కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచేందుకు కుట్రలు జరుపుతున్నారని ఆరోపించారు.కెసిఆర్ ప్రభుత్వ దాడులకు బెదిరేది లేదని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతు ఉందని ప్రజావ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుందని,దానికి ఆపే శక్తి ఎవరికీ లేదని ఆరోపించారు...ఇలాంటి దాడులకు,కేసులకు కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదని,కేసీఆర్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు,